దీపం-2 పథకం: అర్హులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్‌కు రూ.867 కోట్ల సబ్సిడీ విడుదల

దీపం-2 పథకం కింద రెండో ఉచిత గ్యాస్ సిలిండర్‌కు రూ.867 కోట్ల సబ్సిడీ విడుదల

Deepam 2, అమరావతి, మే 2:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘దీపం-2 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు భారీగా నిధులు కేటాయించింది. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.867 కోట్లు విడుదల చేసింది. ఈ సబ్సిడీని ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో పంపిణీ చేయనున్నారు.

ఈ నిధులు వివిధ సంక్షేమ శాఖల ఖాతాల్లో జమయ్యాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఎస్సీ కార్పొరేషన్‌ – రూ.16,330 లక్షలు
  • ఎస్టీ కార్పొరేషన్‌ – రూ.3,870 లక్షలు
  • బీసీ సంక్షేమ శాఖ – రూ.46,522 లక్షలు
  • ఈడబ్ల్యూఎస్ విభాగం – రూ.14,582 లక్షలు
  • మైనారిటీ సంక్షేమ శాఖ – రూ.5,396 లక్షలు

ప్రతి లబ్ధిదారుడికి ఈ రెండో సిలిండర్ ఉచితంగా అందించేలా మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి.

ఇక మరో ముఖ్య సమాచారం ప్రకారం, పౌర సరఫరాల శాఖ కొత్త చీఫ్ విజిలెన్స్ అధికారిగా కె.రంగకుమారిని ప్రభుత్వం నియమించింది. ఆమె ఇప్పటి వరకు కమిషన్ కార్యాలయంలో అదనపు డైరెక్టరుగా సేవలందించారు.

ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇలాంటి అనుకూల వార్తల కోసం news18z.com ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి!

Leave a Comment