చిరంజీవి విలన్‌గా యంగ్ హీరో..? అనిల్ రావిపూడి సినిమాలో సెన్సేషన్!

చిరంజీవి సినిమాకి కార్తికేయ విలన్‌గా? – టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘MEGA 157’ గురించే టాలీవుడ్ లో ఇప్పుడు మండి పుట్టింది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే అదితి రావు హైదరి, పరిణీతి చోప్రా హీరోయిన్లుగా నటించనున్నట్టు టాక్ వినిపిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు మరో సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

కార్తికేయ విలన్‌గా?

తాజా సమాచారం ప్రకారం, ‘Rx 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ చిరంజీవి 157వ చిత్రంలో విలన్‌గా నటించనున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, కార్తికేయ కూడా ఈ నెగటివ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

కార్తికేయ మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ఒకసారి ఓ ఫంక్షన్‌లో స్టేజ్ మీద మెగాస్టార్ మీద తన అభిమానాన్ని ఎమోషనల్‌గా బయటపెట్టాడు. ఇప్పుడు అదే అభిమానం చిరుతో స్క్రీన్ మీద విలన్‌గా తలపడేలా చేస్తుందా? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది.

మెగా ఫ్యాన్స్ స్పందన

ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. “కార్తికేయ పాత్ర సీరియస్ టచ్‌లో ఉంటే సినిమా హైప్ పెరుగుతుంది” అంటున్నారు. మరోవైపు, “కామెడీ విలన్ లా చూపిస్తే మిస్సవుతుందని” హెచ్చరిస్తున్నారు. కార్తికేయ నటనపై కొంతమంది సానుకూలంగా స్పందిస్తుండగా, మరికొందరు “మెగాస్టార్ లెవెల్‌కు సరిపోతాడా?” అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారిక ప్రకటన ఎప్పుడంటే?

ఇప్పుడు ఈ క్రేజీ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ కాంబినేషన్ జరిగితే మాత్రం ‘MEGA 157’ సినిమాపై మళ్లీ డబుల్ హైప్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ!

భారత్ Vs పాకిస్తాన్ వాణిజ్య యుద్ధం: ఎగుమతులు – దిగుమతుల లిస్ట్ ఇదే!

Leave a Comment